Tuesday, 3 November 2026

ర్యాగింగ్‌ వ్యతిరేక వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ జాగృతి విద్యార్థి ఫెడరేషన్‌ (టీజేఎస్‌ ఎఫ్‌) ఓయూ కన్వీనర్‌ వెంకట్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ర్యాగింగ్‌ వ్య తిరేక వాల్‌ పోస్టర్‌ను ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో సోమవారం ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యురాలు ఫ్రొఫెసర్‌ సూర్యాధనుంజయ, ఓయూ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ ప్రొఫెసర్‌ లక్ష్మయ్య, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రాంచంద్రమ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనివర్సిటీలో ర్యాగింగ్‌ అనే వికృత చేష్టలకు స్వస్తి పలికి తోటి విద్యార్థుల పట్ల సోదరభావంతో మానవత్వంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. ర్యాగింగ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయ న్నారు. తోటి విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అన్ని కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు వేసి ర్యాగింగ్‌ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీజేఎస్‌ఎఫ్‌ నాయకులు వంశీ, కొండల్‌, మురళీ, శంకర్‌, శ్రీకాంత్‌, జగన్‌, జానయ్య, సేవా, తిరు మలేష్‌, కమలాకర్‌రెడ్డి, స్వాతి, రహీం, రాంబాబు, వెంకట్‌, రాజశేఖర్‌, కిషన్‌, సత్య నారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *