Tuesday, 3 November 2026

మారిషస్‌లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్‌ సిటీ: తెలుగు రాషా్ట్రల్లో పుట్టి, పెరిగి తెలుగు భాషను మర్చిపోతున్న ఈ కాలంలో మారిషస్‌లోని తెలుగువారు భాషను కన్నతల్లిలా కాపాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు తెలుగు భాష బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని అక్కడి తెలుగు సంఘం నిర్ణయించింది. దశాబ్దాల క్రితం భీమిలీ, వైజాగ్‌, గంజాం, విజయనగరం, కాకినాడ, బర్హంపూర్‌, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి భారీగా తెలుగు ప్రజలు అక్కడికి వలస వెళ్లారు. ప్రస్తుతం అక్కడ 60 వేలకు పైగా తెలుగు వారుంటున్నట్లు అంచనా. ప్రత్యేకంగా స్కూళ్లను ఏర్పాటు చేసి అక్కడ 100 స్కూళ్లలో తెలుగు భాషను బోధిస్తుండ టం గమనార్హం. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ను మారిషస్‌ ప్రభుత్వం ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. ప్రపంచంలోని తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘తెలుగు డయాస్పొరా ఇంటర్నేషనల్‌’ సంస్థను అమర్‌నాథ్‌ ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *