లంబాడీల ఐక్య వేదిక భద్రాద్రి జిల్లా ఇంఛార్జిగా భూక్యా అజయ్ నాయక్
టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి ): లంబాడీల ఐక్యవేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జిగా టేకులపల్లి మండలానికి చెందిన భూక్య అజయ్ నాయక్ ను నియమించారు . ఈ మేరకు లంబాడీల ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు భూక్యా అజయ్ నాయక్ మంగళవారం విలేకరులకు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన లంబాడీల అభిహృద్ది కోసం పని చేస్తానని తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, గిరిజన 12% రిజర్వేషన్ విడుదల చేసే వరకు పోరాటం చేపడతామన్నారు. రైతు బంధు త్వరగా ఇవ్వాలని, పోడు భూముల మీద గిరిజనులకు మాత్రమే హక్కు ఉందని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రతి గ్రామ పంచాయతీ తండా లకు కనీసం 1కోటి రూపాయలు నిధులు కేటాయించి తండాలను అబిహృద్ధి చేయాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఇన్చార్జిగా నియమితులు చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.