లక్ష్మీదేవిపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం

లక్ష్మీదేవిపల్లి, ఆగష్టు , జనంసాక్షి: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ముంచెత్తడంతో దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి, బైరాగులగూడెం, గంగోలు డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు లక్ష్మీదేవిపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం బాధిత కుటుంబాల వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఎంపీడీవో చంద్రమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు గ్రామాలకు సంబంధించిన రెండు వందల కుటుంబాలకు 700 మందికి దుప్పట్లు, చీరలు, చిన్నపిల్లలకు డ్రస్సులు, పాయింట్ సెట్లు, టీ షర్ట్లు అందజేశారు. కొత్తగూడెం పట్టణంలోని కొందరు వస్త్ర వ్యాపారులు వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కష్టకాలంలో వరద బాధితులకు విలేకరులు చేయూత ఇవ్వడం సంతోషకరమన్నారు. వరద బాధితులకు మరెందరైనా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భానోత్ వీరు, కార్యదర్శి శంకర్, కోశాధికారి జోగం తారక్, పురుషోత్తం, రాజశేఖర్, రాము, పాషా, పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వరి, గంగోలు గ్రామ సర్పంచ్ మడకం చంద్రశేఖర్, గ్రామస్తులు అర్జున్, జై సింహ తదితరులు పాల్గొన్నారు.