Wednesday, 4 November 2026

లక్ష్యం నిర్దేశించుకుని ప్రయత్నం మొదలుపెట్టాలి

సెప్టెంబర్16(జనంసాక్షి)

ఉద్యోగం సాధించే వరకు విశ్రమించవద్దు

ఎట్టి పరిస్థితులలోనూ నిరాశను దరిచేరనియ్యవద్దు .. రెట్టించిన ఉత్సాహంతో శ్రమించాలి

ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వారంతా కష్టపడి బయటకు వచ్చిన వారే

సాధారణ చదువుతోనే రైట్ సోదరులు విమానం కనుగొన్నారు

1498లో కొలంబస్ అమెరికాను కనుగొన్నారు .. ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం

గాంధీ ఆత్మకథ చదవండి .. అనేక కొత్త విషయాలు తెలుస్తాయి

పట్టుదల ఉంటే దేన్నయినా సాధించవచ్చు

చక్రం కనుగొన్న తర్వాత మానవ పరిణామక్రమం మారిపోయింది

6వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు పూర్తిగా చదవాలి

గతంలో ఉన్న దానికి, ఇప్పటికి పాఠ్యాంశాలు పూర్తిగా మారిపోయాయి

గతంలో చదువుకోవడానికి ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మారిపోయాయి .. ఇప్పుడు కష్టపడి చదివే ఓపిక ఉంటే మిగతావన్నీ అందుబాటులో ఉన్నాయి

చదవడం మూలంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

 

బీసీ స్టడీ సర్కిల్ ను సద్వినియోగం చేసుకోవాలి

90 రోజులు కాకుంటే 180 రోజుల పాటు శిక్షణనిస్తాం

వనపర్తికి శాశ్వత స్టడీ సర్కిల్ కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేయించాం

నిరుద్యోగులకు ఎలాంటి ఆర్థికభారం లేకుండా ఉండాలని స్టడీసర్కిళ్ల ఏర్పాటు

వనపర్తి డిగ్రీ కళాశాలలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పిన వారికి నగదు బహుమతులు అందజేశారు