సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
జనం సాక్షి కదలాపూర్
తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ భవనానికి అంబేద్కర్ గారి పేరు ఖరారు చేయడం సంతోషకరమని మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జిల్లా సాంస్కృతిక శాఖ జిల్లా కన్వీనర్ బత్తుల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సింగారపు చిన్నయ్య ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రావడానికి కారణం అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారానే మనం సాధించామని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వర్దిని నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు గడిల గంగ ప్రసాద్, కోట లక్ష్మీ నరసయ్య, మైస శ్రీధర్ ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ రఫీ, కొండ ఆంజనేయులు సర్పంచ్ గజ్జేల స్వామి, పాలెపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు