Thursday, 5 November 2026

లఖ్వీ విడుదల

0tatq8gwముంబై దాడుల సూత్రధారి లఖ్వీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆయన్ని విడుదల చేయాల్సిందిగా లాహోర్ హైకోర్టు పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లఖ్వీని అర్ధరాత్రి జైలు నుంచి వదిలేయడంతో ప్రత్యేక మార్గం నుంచి వెళ్లిపోయాడు. విడుదల తర్వాత గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లినట్టు తెలుస్తోంది.మరోవైపు, పాకిస్థాన్ చర్యను భారత్ తప్పుపట్టింది. లఖ్వీని జైలు నుంచి విడుదల చేయొద్దంటూ చేసిన విజ్ఞప్తిని పాక్ పట్టించుకోలేదు. లఖ్వీకు గతంలో బెయిల్ ఇచ్చినా భారత్ అభ్యంతరంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *