లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వంగ వెంకటరామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, చౌటపల్లి గ్రామసర్పంచ్ గద్దల రమేష్ తదితరులతోపాటు ప్రజాప్రతినిధులు నాయకులు హుస్నాబాద్, మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ. 1,31,500/- విలువచేసే చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పి వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి ఎంపీపీ లకావత్ మానస మాట్లాడుతూ, హుస్నాబాద్ శాసనసభ్యులు, సతీష్ కుమార్, సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి అమలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో
 టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు,లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
Attachments area