లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) లయన్స్ క్లబ్ మఖ్తల్ భీమా ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబాదాసు అధ్యక్షతన లైన్స్ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ భాష అయిన “హిందీ భాషా ప్రాముఖ్యత ” అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించడంతో పాటు విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం హిందీ ఉపాధ్యాయులు విభీషణ్, సుధీర్, విజయలక్ష్మి, శాంతాబాయి, లక్ష్మి, రహమత్, నరసింహ, ఆనంద్, వెంకటేష్, బాలక్రిష్ణ, రూప, అమృత, శ్రీశాంత్ లకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ డీవీ చారి, అడ్మినిస్ట్రేటర్ అక్కల సత్యనారాయణ, కట్టా వెంకటేష్, అంజన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.