లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మక్తల్ జూలై 26 (జనంసాక్షి) లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు ప్రోగ్రాం చైర్మన్ కొండ విజయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు అధ్యక్షుడు సుగురు జయపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా సుమారు 240మంది విద్యార్థినిలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, 50 మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించామని, 40 మందికి కంటి మందులను పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ డివి చారి ,జోనల్ చైర్మన్ రమేష్ రావు, సభ్యులు అక్కల సత్యనారాయణ, సుజాత టీచర్ ,పృథ్వీరాజ్, శంకర్, కంటి వైద్య నిపుణులు వెన్నెల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.