లర్నింగ్ లైసెన్స్ పంపిణీ చేసిన చింతా ప్రభాకర్

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , ఆగస్టు 10  ::

సంగారెడ్డి మండలం , సంగారెడ్డి పట్టణం, కొండాపూర్ మండలానికి చెందిన యువతీ యువకులకు సంగారెడ్డి పట్టణంలోని టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో గురువారం లర్నింగ్ లైసెన్స్ పంపిణీ చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాలని చింతా ప్రభాకర్  సూచించారు. ఈ సందర్భంగా లర్నింగ్ లైసెన్స్ అందుకున్న యువతీ యువకులు సంతోషం వ్యక్తం చేశారు. మంచి ఆలోచనలతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ చేస్తున్న చింతా ప్రభాకర్ లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈరోజు 350 మంది యువతీ యువకులకు లర్నింగ్ లైసెన్సులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో CDC చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి,మాజీ CDC ఛైర్మెన్ విజేందర్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు,కార్యదర్శి నర్సింలు జెడ్పీటీసీ లు , వివిధ మండల పార్టీ అధ్యక్షులు ,సర్పంచులు పాల్గొన్నారు.

తాజావార్తలు