లలిత సోమేశ్వరాలయం దర్శించుకున్న సింగోటం రామన్న

జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 20
కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో శ్రీ లలిత సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సింగోటం రామన్న ఈరోజు సోమశిల శ్రీ లలిత సోమేశ్వర ఆలయాని అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు సింగోటం రామన్న సందర్శించి లలిత సోమేశ్వరుని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సింగోటం రామన్న ని శాలువతో సత్కరించారు.రామన్న తో పాటు ఆదాబ్ సబ్ ఎడిటర్ శివశంకర్ (అపురూప) కి కూడ సన్మానించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ లలిత సోమేశ్వరుని దివ్య ఆశీస్సులుతో కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల ఆరోగ్యంగా,ఆర్థికగా, ఎల్లవేళలు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో లలిత సోమేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోవింద్ రెడ్డి ఆంజనేయులు తాటికొండ కృష్ణయ్య అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.