లాభదాయక పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

జిల్లాలో ఉద్యాన, ఆయిల్ ఫామ్ పంటల సాగు పెరగాలి
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
యువ రైతులను మరింత ప్రోత్సహించాలి
17న రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి
–  మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతినిధి(జనంసాక్షి): వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని  క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో లాభదాయక పంట సాగు విధానంపై సమీక్షించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 17న మన్యం సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట నియోజక వర్గం పరిధిలో గల రైతులతో రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులకు లాభదాయక పంటల వైపు మొగ్గు చూపేలా ప్రత్యేక తర్ఫీదు అందించనున్నట్లు తెలిపారు.రైతు అవగాహన సదస్సుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.జిల్లాలో ఉద్యాన, ఆయిల్ ఫామ్ మరింత సాగులో వచ్చేలా ప్రత్యేక కృషి చేయాలని, యువ రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సదస్సులో అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సదస్సుకు వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ అధికారులు తప్పక హాజరు అయ్యేలా చూడాలని  అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో  డిఏఓ రామారావు నాయక్, డిహెచ్ఓ శ్రీధర్ గౌడ్, ఉపేందర్ రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.