Tuesday, 3 November 2026

లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే మోడీ లక్ష్యం

మళ్ళీ గ్యాస్ ధరలు పెంపు
పేద ప్రజల పైన పెను భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్
జనం సాక్షి, చెన్న రావు పేట
కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన చాలా అధ్వనం గ తయారైందని,లాభ సాటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేసి మోడీ సోదరులకు లాభాలు చేకూరే విధంగా చేస్తున్నాడని, మోడీ కేసీఆర్ లు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ అన్నారు.అలాగే రాష్ర్టంలో, దేశంలో విధ్వంసం సృష్టించి,మత కలహాలు సృష్టించి ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తున్న బి.జె.పి.కి బుద్ధి చెప్పాలని కోరారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాజీపేట రైల్వే కోచ్,గిరిజన యూనివర్సిటీ,బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైందని,నాలుగు వేల మెగా వాట్ల ఎన్ టి.పి సి నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు.కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో కెడి ల పరిపాలనలో ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.అదేవిధంగా దేశాన్ని ఎనిమిది సంవత్సరాలు పరిపాలించిన మోడీ 80 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల పైన భారం మోపుతున్న ఈ మోడీ మళ్ళీ అధికారం కోసం దొంగ నాట కాలడుతున్నాడని, విజయ్ మాల్యా,లలిత్ మోడీ వంటి బడా వ్యాపారుల అప్పులు మాఫీ చేసి పేద ప్రజల పైన పన్నుల రూపంలో చార్జీల రూపంలో భారం మోపు తున్నాడని,ప్రతి రంగాన్ని ప్రైవేటీకరణ చేసి పేద ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాడని ఎల్ ఐ సి రైల్వే వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను రిలయన్సులో కలిపి లాభాలు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు.. రిలయన్స్లో మోడీ,మోడీ సోదరులకు వాటాలు ఉన్నాయని,అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడని గోపాల్ నాయక్ అన్నారు.సంవత్సర కాలంలోనే 240 రూపాయలు గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న మోడీని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.హైదరాబాద్ లో జరిగిన జాతీయ సమావేశాలలో కనీసం తీర్మానాలు లేకుండానే ముగించారని తెలంగాణకి ప్రధాని హోదాలో ఏమైనా ప్రకటిస్తారని ప్రజలు ఆశించారని కానీ మోడీ ఏమి ప్రకటించలేదని,అలాగే మోడీ, కేసీఆర్ లు దొందు దొందేనని మొన్న జరిగిన బహిరంగ సమావేశంలో కేసీఆర్ గురించి ఒక మాట కూడా మాట్లాడని మోడీని ప్రజలందరూ గమనిస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సయ్య గౌడ్,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్,మండల పార్టీ ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాద్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్,వార్డ్ సభ్యులు అనూష ఎల్లగౌడ్,ఆకుల అశోక్,రమేష్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.