లాభాల వాటా ప్రకటనపై జాప్యమేల
కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలికాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సింగరేణి కి బకాయిపడ్డ వేల కోట్ల రూపాయల ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి.
-ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని ఆర్ కె ఓ. సి.లో జరిగిన గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యకి ఇండియన్ మైన్స్ వర్కర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 డిమాండ్లపై ఇల్లందులోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రైవేటు పరం చేయకుండా, సింగరేణి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం తీసుకోవాలని,2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35%శాతం వాటానుచెల్లించాలని, సొంతింటిపథకంఅమలుపరచాలని, కార్మికులకు అలవెన్స్ లపై ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని వేజ్ బోర్డును తొందరగా పరిష్కరించాలని కోరారు.కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి సాధించి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకువస్తే, వాటిని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టకుండా రాష్ట్రప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలను ఎం.డి. మళ్లిస్తున్నాడని ఆయన విమర్శించారు. సింగరేణి యాజమాన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టప్రకారం వివిధ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నపటికిని, సింగరేణి సంస్థ కు రావాల్సిన వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. టిబిజికేఎస్ సింగరేణి లోకార్మికులకు, సంస్థకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. కంపెనీలో పర్మినెంట్ కార్మికులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ వేతనాలు ఇస్తూ కాంట్రాక్టు కార్మికుల నియమించినపుడు, అధికారులను ఎందుకు నియమించవద్దని ఆయన ప్రశ్నించారు. సింగరేణి లో లక్షా పదిహేను వేల మంది కార్మికులున్న సమయంలో 2450 మంది అధికారులు ఉండగా, ఇప్పుడు 42 వేల కార్మికులకు కూడా అధికారుల సంఖ్య తగ్గలేదని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది ఉన్నత చదువులు పూర్తి చేసి న నిరుద్యోగులకు కాంట్రాక్టు కింద అధికారులుగా ఎందుకు నియమిస్తలేరని నిలదీశారు. అదేవిధంగా రామకృష్ణాపూర్ ఓ సి ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం దుర్మార్గమని, ఖచ్చితంగా సింగరేణి నడపాలని లేకుంటే రాబోయే రోజుల్లో సమ్మె చేసి కార్మిక వ్యతిరేక సంఘాలని తరిమికొట్టే రోజు కచ్చితంగా వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు ఆర్కేపీ బ్రాంచ్ కార్యదర్శి ఎం.డీ.అక్బర్ అలీ, ఇప్ప కాయలు లింగయ్య, పిట్ కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు రామకృష్ణ ,పూరిల్ల శ్రీనివాస్, రాజయ్య, తిరుపతి, వెంకటరెడ్డి, టి రవీందర్, సంపత్, వీరయ్య, పాషా, ఆర్. శంకరయ్య, కార్మికులు, పాల్గొన్నారు.