Tuesday, 3 November 2026

లారీ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): లారీ డ్రైవర్‌ నిరల్‌క్ష్యం ఓ వ్యక్తిని బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న అతడిని లారీ వెనకనుంచి ఢీకొంది. నగరంలోని కూకట్‌పల్లి సవిూపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.