లారీ యజమానులకు సహకరించాలి

నూతన సిఐ కి స్వాగతం పలికిన లారీ అసోసియేషన్ నాయకులు
కోదాడ టౌన్ ఆగస్టు 14 ( జనంసాక్షి )
లారీ యజమానులకు పోలీసు శాఖ సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు ఉమ్మడి నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావులు  పేర్కొన్నారు.ఆదివారం ఇటీవల నూతనంగా కోదాడ పట్టణా పోలీస్ స్టేషన్ కు సీఐగా బాధ్యతలు స్వీకరించిన శివశంకర్ ను వారు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.పలు రకాల కారణాలతో రవాణా రంగం తీవ్రంగా నష్టపోయి ఉందని పోలీస్ శాఖ వారు సహృదయంతో సహకరించాలన్నారు. ఆన్లైన్ చలానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు.నిబంధనల ప్రకారం నడుచుకుంటామని పోలీస్ శాఖ వారు తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు,ఉమ్మడి నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు,జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ,మాజీ కార్యదర్శి విలాస కవి నరసరాజు,ఆవుల బాబు తదితరులు పాల్గొన్నారు.