Thursday, 5 November 2026

లాహోర్‌మృతుల సంఖ్య 8మంది

లాహోర్‌,ఫిబ్రవరి17(ఆర్‌ఎన్‌ఎ): పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతులు ఎనిమిదికి చేరారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.లాహోర్‌లోని పోలీస్‌లైన్‌లో జరిగిన ఈ బాంబు పేలుడు ఆత్మహుతి దాడిగా సమాచారం. ఈ శక్తివంతమైన పేలుడు దాటికి సవిూపంలో ఉన్న బిల్డింగ్స్‌ అద్దాలు పగిలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టుప్రక్కల విస్తృత గాలింపు చర్యలను చేపట్టారు. తొలుత ఆరుగురు మరణించగా తరవాత మృతుల సంఖ్యపెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *