Tuesday, 3 November 2026

*లింగంపేట్ లో విఆర్ఏలు కబడ్డీ ఆడుతు నిరసన

21వ రోజుకు చేరిన విఆర్ఏల నిరవధిక సమ్మె
_________________________
లింగంపేట్ 14 ఆగస్టు (జనంసాక్షి)
 విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె ఇరవై ఒక్క రోజు అవుతున్న ప్రభుత్వం స్పందించక పోవడంతో ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ముందు కబడ్డీ ఆటతో విఆర్ఏలు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విఆర్ఏల లింగంపేట్ మండల అధ్యక్షులు అడ్డి రవి మాట్లాడుతు రాష్టృ విఆర్ఏలు జేఏసి పిలుపు మేరకు కబడ్డీ ఆటతో నిరసన తెలిపామన్నారు.ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె ఆపేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం విఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దోల్ల అంజన్న,చిలుక రమేష్,నీల రమష్ విఆర్ఏలు పాల్గొన్నారు.