రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కొండా యాదగిరి
ఎల్బీ నగర్ (జనం సాక్షి )లింగోజిగూడ డివిజన్ ను అన్నిరంగాలలో అభివృద్ధిచేసిన ఘనత ముద్ర బోయిన శ్రీనివాసరరావు కే దక్కుతుందని రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కొండా యాదగిరి అన్నారు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పోరేటర్ ,జీహెచ్ఎంసీ ఫ్లోర్లీడర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు జన్మదినం పురస్కరించుకొని సోమవారం నాడు రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండా యాదగిరి అధ్వర్యంలో ముద్రబోయినకు బొకే అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .శ్రీనివాసరావు కు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో పార్టీలో కీలక పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో సుర్వి పెంటయ్యగౌడ్ ,భానుప్రకాశ్ రెడ్డి, జగదీశ్ గౌడ్ శ్రీధర్గౌడ్ ,గోపాల్ ముదిరాజ్ ,రాజునాయక్, శివగౌడ్ , తదితరులు పాల్గొన్నారు




