Thursday, 5 November 2026

లిప్టు డోర్‌లో ఇరుక్కుని బాలుడు మృతి

హైదరాబాద్‌,మే24(జ‌నం సాక్షి):  లిప్టులో ఇరుక్కుని ఓ బాలుడు మృతిచెందిన విషాద సంఘటన గురువారం ఉదయం నగరంలోని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల బర్కత్‌ పురాలో చోటుచేసుకుంది. వేణు అనే 12 సంవత్సరాల బాలుడు ప్రస్తుతం పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో పేపర్‌ బాయ్‌గా  చేరాడు. అయితే… బర్కత్‌పురాలో ఓ అపార్టుమెంటులోని ఫ్లాట్‌లో పేపర్‌ వేసి లిప్టులో కిందకు దిగి బయటకు వస్తుండగా రెండు డోర్లు తెరుచుకుని మళ్లీ వెంటనే దగ్గరకు రావడంతో ఆ రెండు డోర్ల మధ్య ఇరుక్కుని బాలుడు మృతిచెందాడు. కాగా.. లిఫ్టు నిర్వహణ సరిగా లేనందునే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సవిూక్షిస్తున్నారు.