లూధియానాలో దారుణం
లుధియానా : పంజాబ్‌లోని లూధియానాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే మహిళను రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి ఇనుప రాడుతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. నలుగురు దుండగుల్లో ఒకరు ఈ ఘటనను కెమెరాతో చిత్రీకరించాడు. కూడా అయితే స్థానికులు ఎవరూ ఈ దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాలేదు. పంజాబ్‌లో కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను రోడ్డుపైనే పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.