Thursday, 5 November 2026

మిర్చి రైతులను కలిసిన షర్మిల

విజయవాడ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల కృష్ణా జిల్లా గూడెం మాధవరం గ్రామంలో మిర్చి రైతులను కలిసి, వారితో మాట్లాడారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు పాదయాత్రను ఈరోజు ఆమె ఇక్కడ నుంచి ప్రారంభించారు. మిర్చి రైతులు షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మార్కెట్‌లో నాలుగు వేల రూపాయలు కూడా గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు లక్షల్లో అప్పులు చేసినట్లు తెలిపారు.విద్యుత్‌ సక్రమంగా అందక దిగుబడి తగ్గిపోయిందని తెలిపారు. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వ్యవసాయం చేయలేకపోతున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ చనిపోయిన తర్వాత కౌలురైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *