జనం సాక్షి జడ్చర్ల :
జడ్చర్ల మున్సిపాలిటీలో చిన్నపాటి వర్షాలకు కూడా జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాలను పట్టణ నడిబొడ్డులో ఉన్న నల్లకుంటను శనివారం మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి గల కారణాలను సమస్యలను గుర్తించామని వాటి సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికను రచిస్తున్నామని అన్నారు నల్లకుంట ప్రాంతంలో డ్రైనేజీలు చిన్నవిగా ఉండడంతో వర్షపానీరు రోడ్లపై ప్రాంతాల్లోకి చేరుతుందని నల్లకుంట ప్రాంతంలో పెద్ద డ్రైనేజీల ఏర్పాటుకు మున్సిపల్ అధికారులతో చర్చించి ప్రణాళిక రచంచి లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయం కాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని సీతారామారావు అన్నారు స్థానిక తహసిల్దార్ లక్ష్మీనారాయణ పట్టణ సిఐ రమేష్ బాబు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు అన్నారు.




