Wednesday, 4 November 2026

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కార్పొరేటర్

 అల్వాల్ (జనంసాక్షి) జూలై 23

 అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ లోని భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించిన అల్వాల్ కార్పొరేటర్  చింతలశాంతి శ్రీనివాసరెడ్డి శ్రీ బేకరీ దగ్గర పూర్తిగా జలమైనందున మాన్సూన్ సిబ్బందితో నీటిని నిలవకుండా చేశారు. భారతి నగర్ జ్యోతి నగర్ ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాలు ఉన్నా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రావాలని కార్పొరేటర్ తెలిపారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు డి ఈ ప్రశాంతి విజయ రామారావు స్థానిక నాయకులు బలవంత రెడ్డి అరవింద్ కుమార్ కవిత నరేందర్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.