హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్న రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారినుంచి బలవంతంగా తీసుకున్న లేఖలపై వివరణ ఇవ్వాలని ఆదేవించింది. తమ అంగీకరాపత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని వేసిన పిటిషన్‌పై రైతులకు న్యాయస్థానంలో సానుకూల తీర్పు వచ్చింది. కాగా అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు వెల్లడించింది.15 రోజుల్లోగా ఆ దరఖాస్తుల పక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులపై కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులను మనిహాయిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వారి అభ్యర్ధనలను అంగీకరిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరపున ఆడ్వకేట్ జనరల్ ఈ విషయాలను హైకోర్టుకు తెలియచేశారు. 9.2 నిబంధన కింద అభ్యంతరాలు తెలిపిన రైతుల వాదనను పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆయన తెలియచేశారు. మరో పదిహేను రోజులలో తుది నోటిఫికేషన్ ఇస్తామని కూడా వెల్లడించింది. ఇందులో ఎలాంటి లిటిగేషన్ లేకుండా, ఆ రైతులపై కక్ష సాధించే చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం నిజాయితీగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంది. .ఇది సరైన దిశలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. కాగా ఈ విజయం బలవంతపు భూ సవిూకరణ వ్యతిరేకిస్తున్న రైతులదని న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలతో అంగీకార పత్రాలను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ ఆంధప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ల్యాండ్ ఫూలింగ్ నుంచి తమను విముక్తి చేయాలంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. క్లాస్ 22 సెక్షన్ 2(52) ఆఫ్ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని.. బలవంతంగా భూములు లాక్కొనే పరిస్థితి సర్కార్ తెచ్చిందని రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.




