Wednesday, 4 November 2026

ఇందూ ఆస్తుల జప్తు

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కొన్ని ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. జగన్‌కు రూ. 70 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిపై అభియోగం నమోదైంది. రూ. 130 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అనంతపురం జిల్లాలోని 8,648 లేపాక్షి భూములు జప్తు, కూకట్‌పల్లిలోని 2.5 ఎకరాల చిడ్కో భూములను జప్తు చేస్తున్నట్లు ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. . జగన్‌కు రూ.70కోట్లు ముడుపులు ఇచ్చినట్లు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిపై అభియోగం నమోదు కావడంతో ఆస్తుల జప్తు చేపట్టింది.  కూకట్‌పల్లిలోని 2.5ఎకరాల చిడ్కో భూమితో పాటు అనంతపురం జిల్లాలోని 8,648 ఎకరాల లేపాక్షి భూములు జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *