వంతెన నిర్మాణంలో జాప్యాన్ని విడాలి

సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ఆందోళన
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 01 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామ మత్తడి వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ మత్తడి వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం) మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కడవేరుగు గ్రామంలో సిపిఐ(ఎం) పార్టీ పోరాటాల కారణంగా  గత నాలుగు నెలల క్రితం వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారని ఇప్పటివరకు వంతెన నిర్మాణం చేపట్టకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ ప్రాంతం మీదుగా నాగపురి, శభాష్ గూడెం, వట్టిపల్లి, మునిగడప, పోతిరెడ్డిపల్లి, రాజుపేట, ఐనాపూర్, జగదేవ్పూర్, గజ్వేల్, కొండపోచమ్మ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అనేక వాహనాలు చెడిపోయాయన్నారు.
ప్రమాదాలు జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.  అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, ఇకనైనా వంతెనకు సరిపడ నిధులు మంజూరు చేసి వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, మర్యాల సత్తయ్య, పిట్టల శ్రీను, పిట్టల రవి, మెర్గోజు కృష్ణమూర్తి, బట్టు బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area