తాండూరు జనవరి13( జనం సాక్షి)
వందకు పైగా సర్పంచులను టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
.నియోజకవర్గంలో 143 సర్పంచులు గాను 12 మంది సర్పంచులను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విజయమ్మ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో వందకు పైగా టిఆర్ఎస్ పార్టీ సర్పంచులను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 143 సర్పంచులకు గాను టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా 12 మంది సర్పంచులను కైవసం చేసుకుందని తెలిపారు. గిరిజన తండాలలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా పోటీ పోటీ పడేందుకు యువకులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏ పర్సన్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్రెడ్డి అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్. మాజీ కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుజ్జమ్మ. మాజీ సర్పంచులు ఎర్ర బాలప్ప. కిషన్ రావు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పరి రమేష్ కుమార్. విష్ణు వర్ధన్ రెడ్డి. డి వై నర్సిములు. రవీందర్. వీరన్న. అన్వర్. రంగయ్య. తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి మహేందర్ రెడ్డి




