Tuesday, 3 November 2026

 అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం

 తాండూరు జనవరి13( జనం సాక్షి)
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే తమకు ఒక అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి విజయమ్మ ప్రజలను కోరారు ఆదివారం
పెద్దేముల్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విజయమ్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఓటరుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి. జై వర్ధన్ రెడ్డి. ఎర్ర బాలప్ప. కిషన్ రావు. వీరన్న. నర్సింలు. రవీందర్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.