Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

దేవరకొండ జనవరి 12 (జనం సాక్షి ) : చింతపల్లి మండల పరిదిలోని కుర్మెడ్ గేట్ కంచర కాలనీ వద్ద బస్సు – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది, స్టానికుల వివరాల ప్రకారం చింతపల్లి మండల వర్కాల గ్రామానికి చెందిన జగ్నాలా శేఖర్  (28) రైతు కులీ వింజమూర్ వినోద్ (22 ) ట్రాక్టర్ డ్రైవర్ సంక్రాంతి పండగకు హైద్రాబాదు నుండి  స్వస్థలమైన వర్కాల గ్రామానికి వస్తుండగా మార్గ మద్యలో హైద్రాబాదుకు వెళ్తున్నా బస్సు డీ కొనడంతో వింజమూర్ వినోద్ కాలుపై నుండి బస్సు వెళ్లడంతో కాలు విరగడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందాడు,  జగ్నల శేఖర్ కు తీవ్ర గాయాలతో హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.