Thursday, 5 November 2026

వందకోసం వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్‌,మే24(జ‌నం సాక్షి): వంద రూపాయల కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మూసాపేటలో గురువారం జరిగింది. పాషా అనే రోజు వారి కూలీ వంద రూపాయల కోసం కొందరు వ్యక్తులతో గొడవ పడ్డాడు. ఈ గొడవ పెద్దదిగా మారడంతో వారు పాషాను కర్రలతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.