జీతాలు పెంచాలంటూ కార్మికుల ఆందోళన

నెల్లూరు,మే24(జ‌నం సాక్షి): కార్మికుల వేతనాలు పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని  నెలూరు జిల్లా చిల్లకూరు  మాస్‌ ఫ్యాబ్రిక్‌ పరిశ్రమ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ వద్ద జిఎం వాహనాన్ని మహిళా కార్మికులు అడ్డుకున్నారు. అక్కడికి చెరుకున్న సిఐ, మహిళా కానిస్టేబుల్‌లు కార్మికులను అక్కడనుంచి చెదరగొట్టారు. సిఐ దురుసు ప్రవర్తనకు నిరసనగా చింతవరం సెంటర్లో కార్మికుల ఆందోళన చేపట్టారు. రహాదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.