హైదరాబాద్ : వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లో ఉంటానన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురం మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం పట్టణాన్ని దేశంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాలకు తాగునీరు అందిస్తానన్నారు. తన వందవ చిత్రం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకు అంకితమవుతానని బాలకృష్ణ చెప్పారు




