హైదరాబాద్ : సైబరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్రీడం వాక్ నిర్వహించారు. షీ టీమ్స్ కృషి వలన రాత్రి సమయాల్లో మహిలు రోడ్లపై తిరిగే స్వేచ్చ లభించిందని… స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాటి చెప్పారు. మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ డీసీపీ రమ్య హాజరయ్యారు. నగరంలోని యువతులు షీటీమ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ప్రతి మహిళా స్వేచ్చగా జీవించాలనే నినాదంతో కొనసాగిన ఈ కార్యక్రమం… హైటెక్ సిటీ నుంచి హెచ్ఐ సిసివరకు నిర్వహించారు.




