మూడు రోజుల్లోగా బ్యాంకు ఖాతాలు, ఆదాయ, ఖర్చు వివరాలతో లెక్కలు చూపాలని నోటీసులు జారీ
మిర్యాలగూడ, జనం సాక్షి.:
మిర్యాలగూడ పట్టణంలోని మస్జిదే సరాయే మీరాలం (పెద్ద మస్జీద్) అధీనంలో గల షాపులు, మస్జీద్ అధీనంలో గల మదీనా కాంప్లెక్స్ కుండల బజారు, ఇస్లాంపురలోని షాపింగ్ కాంప్లెక్స్ షాపుల నిర్వహణ. అద్దెల వసూళ్లు కు సంబంధించి 2010 సంవత్సరం నుండి లెక్కలు ఈరోజు వరకు (3) మూడు రోజులలో లెక్కలు చూపాలని అధికారులు కమిటీ అధ్యక్షునికి నోటీసులను అందజేశారు. సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కాంప్లెక్స్ లో షాపుల నిర్వహణ కిరాయిదారుల నుంచి వచ్చిన అద్దె వివరాలతో పాటు జమ ఖర్చులను తదితర వివరాలను సేకరించినట్లు సమాచారం. గత మార్చి నెలలో. మస్జీద్ అధ్యక్షుడికి వక్ఫ్ బోర్డు ఆదేశించినప్పటి ఇప్పటివరకు లెక్కలు చూపని కారణంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. వక్ఫ్ బోర్డు ఓ ఎస్ డి.అసదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో పెద్ద మసీద్,పరిధిలోని కాంప్లెక్స్ షాపుల సంబంధించిన ఆస్తుల ను పరిశీలించి మూడు రోజుల్లోగా బ్యాంకు ఎకౌంటు పుస్తకాలు, డీసీబీ రికార్డు, రిసిప్ట్ బుక్కు తదితర వివరాలతో కూడిన వివరాలను,ఆదాయము, జమాఖర్చులు, వివరాలు చార్టెడ్ అకౌంట్ ద్వారా లెక్కలను ఆడిట్ ఇన్స్పెక్టర్ నల్గొండకుసమర్పించవలసిందిగా నోటీసులు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. అద్దె వసూళ్లకు సంబంధించిన ఆదాయ వివరాలు, కాంప్లెక్స్ నిర్మాణ రివాల్వింగ్ ఫండ్ కు సంబంధించి పూర్తి వివరాలు సైతం అందజేయాల్సిందిగా కోరారు..అయన వెంట వక్ఫ్ బోర్డు అధికార సిబ్బంది, మొహమ్మద్ గయాసుద్దీన్, షేక్ మహమూద్, సుజాత్ అలీ . అలీం. మహమ్మద్ ఖలీల్. సయ్యద్ అక్బర్ లు ఉన్నారు.




