వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటాం వారి బాధలు తీరుస్తాం

మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్16 (జనంసాక్షి);
కామారెడ్డి పట్టణంలోని హరిజన వాడలో శుక్రవారం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా భారత్ జూడో యాత్ర కు మద్దతుగా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గ మాట్లాడుతూ,దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదంటూ సామాన్య, మధ్యతరగతి వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారురు.నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, ఇలా ప్రతిదీ ధరలు పెరుగుతూనే ఉంది. దీనికి తోడు పెరుగుతున్నద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర ఆందోళన కరంగా ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై నిరసన గళం వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నం అన్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు ప్రజల నుండి అందుతున్న ఆదరణ చూసి భారతీయ జనతా పార్టీ తట్టుకోలేక అబద్ధాలు ప్రచారం చేస్తుంది.
రాష్ట్రంలో కెసిఆర్ దళితులకు మోసం చేస్తున్నారని అన్నారు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు
ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్న హామీ ఏటు పోయింది.దళిత బంధు అన్నారు టిఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప అది ఎవరికి రావడం లేదు దళితులకు కాంగ్రెస్ హయాంలోనే ఇంద్రమ్మ ఇల్లు లభించాయి కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంతవరకు ఒక్కరికి కూడా చెందలేదు.నా హయాంలో కామారెడ్డి పట్టణంలో పదివేల ఇల్లు కట్టి పేదలకు పంచినాము సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకువచ్చి వాంబే కాలనీలో పేదలకు ఇండ్లు పంచాము.
సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడంతో సరిపోదు ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి దళితులను ఉన్నత స్థానానికి తీసుకురావాలి.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటాం వారి బాధలు తీరుస్తాం మీరు తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి సహకరించి మీ కలలు సహకారం చేసుకోవాలన్నారు.