వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

మర్పల్లి, సెప్టెంబర్ 21(జనం సాక్షి)
వచ్చే ఏన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతెలంగాణలో కొనసాగనుందని, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నూతన కార్యాలయాన్ని మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక తెలంగాణలో కాంగ్రెస్ కు ఆదరణ పెరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాల్లో రోడ్ల వల్ల ప్రజలు ఆస్పత్రుల పాలు అవుతున్నారని, తాను మంత్రిగా ఉన్న సమయంలో వేసిన రోడ్లపై కనీసం పాట్ హోల్స్ కూడా రిపేర్ చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో
వికారాబాద్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి మైపాల్ రెడ్డి,అబీబ్ అన్సారి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణా రెడ్డి,మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉప్పరి రవీందర్ సాగర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పరి నాగేష్, ఎంపీటీసీ బాల్ రెడ్డి,, ఉప్పరి శ్రీనివాస్, కొంగర జనార్దన్ రెడ్డి, గుడాడి సంతోష్ రెడ్డి, తెలుగు రాఘవేందర్, కొంగర శ్రీనివాస్ రెడ్డి, ఉగ్గేల్లి నర్సింహా రెడ్డి, ఉప్పరి తులసీదాసు, కాస్తిపురం మల్లికార్జున స్వామి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.