వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుంది : కే. కేశవరావు

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాసీ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోమారు సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉందని, కేసీఆర్‌ ఇమ్మంటే ఇవ్వరు, లగడపాటి అపమంటే అపారు అని ఆయన స్పష్టం చేశారు.