Thursday, 5 November 2026

వచ్చే ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తాం

– 16 పార్లమెంట్‌, 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఖాయం

– కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదు

– వారి ఆస్తులను పెంచుకొనేందుకే ప్రాధాన్యతనిచ్చారు

– తెరాస హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి

– తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి

హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సరికొత్త చరిత్రను రాయబోతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం పార్లీ కార్యాలయంలో పల్లా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 16ఎంపీ సీట్లు, 100 కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందదన్నారు. ఆచరణ సాధ్యంకాని హావిూలను ఇస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు పాతాళంలో తొక్కడం ఖాయమని పల్లా తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలు.. తమ ఆస్తులను మాత్రం పెంచుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పడు మమ్మల్ని విమర్శించే వారంతా తెరాసలో చేరాలనుకున్న వారేనని, తెరాసలో తలుపులు మూసి ఉండటంతో ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వెనుకవాటుకు గురైన తెలంగాణలోని అన్ని ప్రాంతాలను క్రమక్రమంగా కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దేశానికే ఆదర్శంగానిలుస్తుందని అన్నారు. ఇది చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ నేతలు తమ అడ్రస్సు ఎక్కడ గల్లంతు అవుతుందోనని భయపడి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.