వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులకు పౌర సన్మానం
మిర్యాలగూడ. జనం సాక్షి :
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ఎన్ ఎస్ పి క్యాంపు గ్రౌండ్ లో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు
భార్గవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న సమర యోధులకు. సైనికులకు పౌర సన్మానం చేశారు..ఈ సందర్బంగా ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ. మిర్యాలగూడ డి ఎస్ పి వై. వెంకటేశ్వర రావు లు పలువురు స్వాతంత్ర సమర యోధులను. సైనికులను ఘనంగా సన్మానించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణకు పాటుపడిన స్వతంత్ర సమరయోధులను సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రిటిష్ వలసవాదుల చేతుల్లో బంధీ గా ఉన్న భారత దేశానికీ స్వతంతం సిద్దించేందుకు ప్రాణ త్యాగం చేసిన యోధులకు శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా మాజీ సైనికులను కూడా సన్మానించారు. అనంతరం చైర్మన్ భార్గవ్ మాట్లాడుతూ వజ్రత్సవాల్లో భాగంగా మంగళవారం దేశ వ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సందర్బంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన బాణా సంచా పలువురిని ఆకట్టుకుంది.. కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ ఏ ఈ అసింబాబా, మున్సిపల్ కౌన్సిలర్లు. పట్టణ ప్రముఖులు. వ్యాపార వాణిజ్య వర్గాలు తదితరులు పాల్గొన్నారు.