వజ్రోత్సవ సంబరాలలో గౌతు జి గూడ గ్రామం
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 20 :: 75 సంవత్సరాల వజ్రోత్సవ స్వాతంత్ర సంబరాలను గ్రామస్తులంతా కలిసి సంబరాలు జరుపుకున్నామని గౌతు జి గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ దత్తత గ్రామం గౌతోజిగూడ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు విజేతలుగా గెలిచిన వారికి బహుమతులు రేపు జిల్లా పరిషత్ చైర్మన్ గారి చేతుల మీదగా అందజేస్తామని గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రెటరీ రమాదేవి ఈసీ లక్ష్మీ నారాయణ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ వార్డు సభ్యులు పెంటమ్మా భవాని శ్రీనివాస్ పద్మ అంజనేయులు సీఏ సీనియర్ మెటు నాగమణి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు