Tuesday, 3 November 2026

వడదెబ్బతో ఉపాధిహామీ కూలీ మృతి

నవీపేట: మండలంలోని నిజాంపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ తల్వేద సాయిలు (46) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం వరకు కూలీ పనులకు వెళ్లిన ఆయన ఇంటికి రాగానే వడదెబ్బకు గురై పడిపోవడంతో వెంటనే ఆయనను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ నిన్న అర్థరాత్రి తరువాత మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని ఏపీఓ సునీత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *