వడపర్తి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా……వడపర్తి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆరోగ్య

 

మేళా……భువనగిరి టౌన్ (జనం సాక్షి):—
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో  గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బీపీ , డయాబెటిస్ ఉన్నవారికి ఎన్సిడి కిట్ బ్యాగ్స్ మందులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం సంధ్యా సమయంలో వ్యాయమం చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని , అలాగే యోగ చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని దీర్ఘ వ్యాధులు కూడా తగ్గుతాయని తెలిపారు. వచ్చిన వారికి యోగ మరియు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసి చూపించారు. మీరు మీ పక్కింటి వారికి గాని , ఎదిరింటి వారికి గాని మేము ఇలా చేస్తున్నాము మీరు కూడా చేయండి అని వారిని ప్రేరేపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి , ఉప సర్పంచ్ మణెమ్మ  , వార్డు మెంబర్స్ , కిరణ్మయి , ఆశా కార్యకర్తలు కే. లలిత , ఎం. ఐలమ్మ , బి. జానకి , గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.