– వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఏడుకొండలు

చండ్రుగొండ జనంసాక్షి (జులై 19) : ఈ నెల  21న స్థానికంగా జరిగే  వడ్డెర సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని  జయప్రదం చేయాలని  వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు  ఉప్పతల ఏడుకొండలు అన్నారు. మంగళవారం జరిగిన ఆ సంఘం సమావేశంలో  ఆయన మాట్లాడారు. గురువారం   వడ్డెర కులస్తుల భవిష్యత్తు ప్రణాళిక సంఘం  ఎన్నిక నిర్వహణ ఉంటుందన్నారు.సభ్యత్వ నమోదుపై చర్చించడం జరుగుతుందని అన్నారు. ప్రశాంత వాతావరణంలో  ఎన్నిక జరిగేందుకు సహకరించాలని  కోరారు. ఈ సమావేశంలో  వడ్డెర సంఘం సభ్యులు పాల్గొన్నారు.