Wednesday, 4 November 2026

వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్

హైదరాబాద్ : వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శాంతమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన దుండగులు తెంపుకుని పోయారు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *