Monday, 2 November 2026

వన్డే ప్రపంచ కప్ కోసం యాప్

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను అందజేసేందుకోసం ఓ యాప్ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో  ఈ యాప్ను రూపొందించింది.

గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచ కప్ సంబంధించి సమస్త, తాజా సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచ కప్లో ప్రతీ మ్యాచ్ ప్రత్యక్ష స్కోరు వివరాలను చూడవచ్చు. ఇక ప్రత్యక్ష ప్రసారం చూడలేకపోయినవారు మ్యాచ్ అనంతరం హైలెట్స్ వీక్షించవచ్చు. వచ్చే నెల 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త ఆతిథ్యంలో ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *