హైదరాబాద్ : వరంగల్ఎన్ కౌంటర్ కు టీఆర్ఎస్ దే బాధ్యత అని కేకే డబ్ల్యూ దళం పేర్కొంది. ఈ మేరకు సోమవారం మావోయిస్టు పార్టీ కేకే డబ్ల్యూ దళం కార్యదర్శి దామోదర్ పేరుతో లేఖ విడుదల చేసింది. శృతి, విద్యాసాగర్ రెడ్డిల ఎన్ కౌంటర్ బూటకమని మండిపడ్డారు. మంచినీళ్ల కోసం వెళ్లిన వీరిద్దరినీ చిత్ర హింసలు పెట్టి చంపారని దామోదర్ ఆరోపించారు. మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అంటూ టీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. ఎన్ కౌంటర్ కు టిఆర్ ఎస్ నేతలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.




