Monday, 2 November 2026

వరంగల్, కరీంనగర్ లో కేసీఆర్ ఎరియల్ సర్వే…

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నేడు, రేపు పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. గోదావరి నది పరివాహన ప్రాంతంలో సీఎం సర్వే నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *