వరద బాధితులకు అండగా ఉంటా
పునరావాస కేంద్రాల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్.
జిల్లా
గోవిందరావుపేట జూలై 14 (జనం సాక్షి):-
ఈరోజు గోవిందరావుపేట మండలం లోని తీవ్ర వర్ష ప్రభావం వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటూ ఆదుకుంటుందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఆయన గురువారం రోజున గోవిందరావుపేట మండలంలోని పస్రా గోవిందరావుపేట చల్వాయి గ్రామాలలో వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను స్థానిక ఎంపిడిఓ తహశీల్దార్ లతో కలిసి పరిశీలించారు. అక్కడ బాధితులకు ఏర్పాటుచేసిన వసతుల గురించి వారికి అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వరదలు రావడం చాలా బాధాకరమని అన్నారు.ఈ కార్యక్రమాలలో గోవిందు నాయక్,ఎంపీపీ సూడీ శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు సాయి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు చెందులాల్ తదితరులు వున్నారు.